కాజీపేటలో మీడియా సమావేశం
ఖాజీపేట . ఒకటో తేదీ బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్లో విద్యార్థి మృతి పై అక్కడికెళ్లిన విద్యార్థి సంఘాలు ప్రజాసంఘాలపై మరియు విలేకరులపై యాజమాన్యం పెట్టిన కేసును వెంటనే తొలగించకుంటే జరగబోయే రోజుల్లో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని మాల మహానాడు తోపాటు విద్యార్థి సంఘాలు మీడియా సమావేశంలో తీవ్రంగా హెచ్చరించాయి
బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్ లో జరిగిన విద్యార్థి మృతి దగ్గరకు వెళ్లిన మీడియా ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల పైన విద్యాసంస్థ అక్రమ కేసులు పెట్టడంపై కాజీపేటలో మీడియా సమావేశం నిర్వహించిన ప్రజాసంఘాలు యాజమాన్యంపై మేము కూడా కేసులు పెడతామని తీవ్రంగా హెచ్చరించారు
ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పోలీసులు, అటు స్కూల్ యాజమాన్యం తప్పుదోవ పట్టించి రాజ్యాంగానికి చదలు పట్టించే విధంగా తయారు చేశారని రాజ్యాంగంలో ఉద్యమాలు చేసే హక్కు ఉంది అని పోలీసులు ఏమాత్రం తెలియకున్నట్టుంది . పోలీసులు యాజమాన్యానికి తొత్తులుగా తయారయ్యాయని అంతేకాకుండా అన్ని కార్యక్రమాలలో ముందుండి ప్రజలు చైతన్యవంతులు చేసిన విలేకరుల పైన కూడా కేసు పెట్టడం దారుణమైన పరిస్థితిని. మేము అక్కడికి వచ్చి విద్యార్థి మృతి ఎలా జరిగింది అని తెలుసుకొని తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉందామని వస్తే తల్లిదండ్రులు కూడా మా కోసం వచ్చారని చెప్పకుండా యాజమాన్యానికి తొత్తులు కాడంతోపాటు కేసులు బనాయించే ప్రయత్నం చేశాయి ఈ చర్యను వెంటనే విరమించుకోకపోతే స్కూలు యాజమాన్యంతో పాటి పోలీసుల మీద కూడా ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టక తప్పదని హెచ్చరించిన వెంకటరమణ
స్కూల్ లోకి ఎవరు ప్రజాసంఘాలు కానీ పత్రికా విలేకరులు కానీ విద్యార్థి సంఘాలు కానీ స్కూల్ ఆవరణంలోకి సిఐ పోకూడదని చెప్పడం విడ్డూరంగా ఉందని గతంలో ఇన్ని కార్యక్రమాలు చేసి నా ఎప్పుడు ఇలాంటి ప్రస్థానం రాలేదని పోలీసులు యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నాయని మాపైన కేసులు తొలగించకపోతే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ యాజమాన్యంతో పార్టీ పోలీసులు పైన కూడా నినాదాలు వెలువెత్తుతాయని ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు
విద్యార్థి సంఘాలుగా అక్కడికెళ్లిన మాకు ఇలాంటి చేదుగా అనుభవం ఎప్పుడు ఎదురు కాలేదని మాకు ఎదురైన విలేకరులకు ఎప్పుడు ఎదురు కాలేదని అన్ని సమస్యలకు ముందుండే ప్రజలకు తెలియజేస్తున్న విలేకరుల పైన పోలీసులు కేసు పెట్టడం ఇది ఖండించదగ్గ విషయమని అక్కడ విద్యార్థి సంఘాలు గాని విలేకరులు గాని ప్రజాసంఘాలు గాని ఎక్కడైనా స్కూలు ఆస్తులు పైన ధ్వంసం చేసినట్లు సీసీ ఫుటేజ్ లో ఉంటే నిర్ధాక్షణంగా మా మీద కేసులు పెట్టచ్చని అలా లేని పక్షంలో తిరిగి మీ మీద యాజమాన్యాల మీద ప్రైవేట్ కంప్లైంట్ వేయక తప్పదని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు రవివర్మ తెలియజేశారు
పలుగొన్న. ఎమ్మార్పీఎస్ వెంకట రమణ సిఐటియు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి