మైదుకూరు ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకం



   మైదుకూరు లోని ఓ ప్రయివేట్ పాఠశాల బస్సు వెనుక అద్దం లేకుండా విద్యార్థులను పాఠశాలకు తరలిస్తున్నా విద్యార్థులు వెనుక వైపు తొంగి చూడడం వల్ల జరగడానికి ప్రమాదం ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని రవాణా శాఖ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 


విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా వెనుకవైపున అద్దం లేని ప్రయివేట్ పాఠశాల బస్ లో విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయానించాల్సి రావడం భాధకరమన్నారు.


విద్యార్థుల నుండి వెల రూపాయలు పాఠశాల బస్సుల పేరుతో వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యం కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు తెలిపారు. విద్యార్థులకు ప్రమాదాలు జరిగినపుడు మాత్రమే స్పందించే రవాణా శాఖ అధికారులు,


 పోలీసులు నిబంధనలు పాటించకుండా నడుస్తున్న పాఠశాలల బస్సు లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యా ప్రమాణాలు పాటించని స్కూల్ యజమాన్యాలపై జిల్లా ఆధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...