ఖాజీపేట స్వతంత్ర సంబరాలకు దూరంగా సిబ్బంది
దేశవ్యాప్తంగా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటుంటే ఇక్కడ మాత్రం ఎవరు హాజరు కాకుండా తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేశారు కనీసం మిగతా రోజులు రాకపోయినా భారతదేశం అంతా సంబరాలు చేస్తుంటే వీరు మాత్రం ఆఫీసులకు రాకుండా సంబరాలు చేసుకుంటున్నారు
ఖాజీపేట మండలం పుల్లూరు పంచాయతీలో సచివాలయ సిబ్బంది ఎవరు స్వాతంత్ర దినోత్సవానికి హాజరు కాకపోవడంతో కోపోద్రేకులైన సర్పంచ్ ఎంపీటీసీ ఏకంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోగలరు
మండలాధికారులు ఈరోజు ఎంక్వయిరీ చేయగా పుల్లూరు పంచాయతీలోనే కాకుండా మండలంలో చాలా పంచాయతీలలో స్వాతంత్ర వేడుకలలో పాల్గొనని వారి పేర్లను సేకరించి మండల వ్యాప్తంగా అందరికీ నోటీసులు ఇవ్వనున్నారని అధికారిక సమాచారం
పుల్లూరు పంచాయతీలోని ఎనిమిది మంది సిబ్బంది పాల్గొనక పోవడంపై అటు కలెక్టర్ తో పాటు మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా ఫిర్యాదు చేశారు
ఈ స్వాతంత్ర దినోత్సవానికి హాజరుకాని వారి పేర్లతో సహా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు వారిలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సర్వేయర్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఏఎన్ఎం మహిళ కానిస్టేబుల్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ తో పాటు ఆశ వర్కర్లు కూడా హాజరు కాలేదని కలెక్టర్ ఫిర్యాదు చేయడంపై మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి