కడప జిల్లాలో ఏఐఎస్ఎఫ్ బైక్ ర్యాలీ.
కడప జిల్లా విద్యారంగ సమస్య పరిష్కారానికై బైక్ ర్యాలీ ప్రారంభించనున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా సభ్యులు.
జిల్లాలో విద్యారంగ అభివృద్ధి కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 25 నుండి 31 వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న "విద్యార్థి సంగ్రామ స్కూటర్ యాత్ర" ను జయప్రదం చేయాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గిరెడ్డి రాజశేఖర్ రెడ్డి,ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు రవివర్మ, పిలుపునిచ్చారు.
బుధవారం మైదుకూరు పట్టణంలోని R.E.S.S.Vజూనియర్ కాలేజీ నందు "విద్యార్థి సంగ్రామ స్కూటర్ యాత్ర" కరపత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
జిల్లాలో విద్యారంగ అభివృద్ధి కోసం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) ఈనెల 25 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల పరిధిలో 20 మండలాలలో దాదాపు 350 కిలోమీటర్ల పాటు స్కూటర్ యాత్ర నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ యాత్ర
ఆగస్టు 25 న ఒంటిమిట్ట లో ప్రారంభం అయి భాకరపేట, సిద్దవటం, అట్లూరు, బద్వేలు, పోరుమామిళ్ల, కలసపాడు, బి.మఠం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, పులివెందుల, వెంపల్లి, వై.వి.యూ మీదుగా ఆగస్టు 31న కడప కు చేరుకుని యాత్ర ముగుస్తుందన్నారు.
ఆగస్టు 25 న ఒంటిమిట్ట లో ప్రారంభం అయి భాకరపేట, సిద్దవటం, అట్లూరు, బద్వేలు, పోరుమామిళ్ల, కలసపాడు, బి.మఠం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, పులివెందుల, వెంపల్లి, వై.వి.యూ మీదుగా ఆగస్టు 31న కడప కు చేరుకుని యాత్ర ముగుస్తుందన్నారు.
జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిస్కారం దిశగా ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. పూటకొక జీవో లు తీసుకువస్తు విద్యరంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయన్నారు.
విద్యార్ధులకు విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు పేనడింగ్ లో పెట్టి వేధిస్తుందన్నారు. సంక్షేమ హాస్టల్స్ ని ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడమే మానేసిందన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు 7 నెలలుగా మెస్, కాస్మొటిక్ చార్జీలు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. జిల్లాలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించనున్న "విద్యార్థి సంగ్రామ స్కూటర్ యాత్ర" ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ నాయకులు అభి, అరవింద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి