ఖాజీపేట ఆదర్శ పాఠశాలలో అద్వానా మధ్యాహ్న భోజన పథకం
ఖాజీపేట ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యనందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాల ఇప్పుడు ఆదర్శం కోల్పోయి ప్రైవేట్ పాఠశాల వైపు దృష్టి మళ్లించారంటే పరిస్థితి ఎలాగుందో అర్థమవుతుంది. చెప్పడానికి ఆదర్శ పాఠశాల చదువులు మాత్రం శూన్యం అంటున్న తల్లిదండ్రులు గత ఏడాది ఫలితాలు చూసి ఏకంగా ప్రవేట్ పాఠశాలలో మారాలంటే ఆశ్చర్యం లేదు
ఇదంతా ఒక ఎత్తయితే పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం ఉదయాన్నే తల్లిదండ్రులు సరైన భోజనం చేయలేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రుల కోసం ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు అద్వానంగా తయారయ్యిందంటే ఆశ్చర్యం లేదు
కాజీపేట ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సరిగా అన్నం సరిగా చేయకపోవడంతో విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి క్యారీలు తెచ్చుకొని చదువుకునే పరిస్థితి ఏర్పడింది.మళ్లీ మొదటికి వచ్చిన మధ్యాహ్న భోజన పథకం ఎంత అధ్వానంగా ఉందో మీకే అర్థమవుతుంది.
ఈ విషయంపై విద్యార్థులను వివరణ అడగ్గా అన్నం ఉడకలేదని కొందరు మరికొందరు అన్నం తిన్న వెంటనే కడుపునొప్పి ప్రారంభమవుతుంది అందుకే ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విద్యార్థులు విద్యార్థి సంఘాలు నాయకులకు తెలియజేశారు
ప్రధానంగా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల పిల్లలు కూడా ఇంటి నుంచి క్యారీలు తెచ్చుకుంటున్నారంటే పరిస్థితి ఎంతవరకు ఉందో అర్థం చేసుకోగలరు. ఇంకా పౌష్టికాహారం పోషణ కోసం ఇస్తున్న గుడ్లు మాత్రం కుళ్ళిన గుడ్లు పెట్టడం. ఎవరైనా అక్కడికి వివరణ అడిగిన వారికి సరైన సమాధానం చెప్పకపోవడం పై ప్రిన్సిపాల్ పై మండిపడుతున్న విద్యార్థి సంఘ నాయకులు
ఆదర్శ పాఠశాలను సందర్శించిన విద్యార్థి సంఘాల నాయకులకు ప్రిన్సిపల్ సరైన సమాధానం ఇవ్వకపోవడం ఒక ఎత్తైతే లోపలి కూడా వెళ్ళనీయకపోవడం మరో ఎత్తు. ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజశేఖర్ రెడ్డి మరియు రవి వర్మ విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి