విద్యారంగా సమస్యల పరిష్కారానికి చలో విజయవాడ ఏఐఎస్ఎఫ్.
ఖాజీపేట (జె సి
న్ ప్రతినిధి) విద్యారంగా సమస్యల పరిష్కారం కోసం భారత విధ్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న జరగనున్న చలో విజయవాడను జయప్రదం చేయాలని *ఎస్.ఎఫ్.ఐ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గిరెడ్డి రాజశేఖర్ రెడ్డి* పిలుపునిచ్చారు. చలో విజయవాడ పోస్టర్స్ ని స్థానిక కాజీపేట బీసీ హాస్టల్ నందు విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ....
రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అన్ని జిల్లా కేంద్రాలలో చలో కలెక్టరేట్ లు నిర్మావహిస్తే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు చేత విద్యార్థి సంఘ నాయకులను, విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు.
సమస్యల పరిస్కారం కోసం విద్యార్థులు రోడ్డెక్కితే సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూడటం దారుణమన్నారు. సంక్షేమ హస్టల్ విద్యార్థులకు నేటికి గత 6,7 నెలల మెస్, కాస్మొటిక్ చార్జీలు విడుదల చేయకపోవడం సరికాదన్నారు. పెరిగిన ధరలకు అనుగునంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు పెచమని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులు చదువులు ఎలా కొంసాగించాలని వారు ప్రశ్నించారు. విద్యాసంవత్సరం ప్రారంభం అయి 4 నెలలు అవుతున్న నాడు నేడు పనులు ఇంకా పూర్తి కాకా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. పాఠశాల విలీనం పేరుతో ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల ముందు విద్యార్థులకు అండగా ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పూర్తిగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్విర్యం చేస్తున్నారని వారు అన్నారు.
ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్.ఎఫ్.ఐ) ఈనెల 30న నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమంలో విద్యార్థులు వేల సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ నాయకులు అభిరామ్, మల్లేశ్వర్ రెడ్డి, నరేంద్ర, సాయి కృష్ణ, శివ శ్రావణ్ కుమార్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి