మైదుకూరు ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం
కాజీపేట మండలంలోని గవర్నమెంట్ పాఠశాల సమీపంలో విద్యార్థి విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో నిలపకపోవడంతో స్పందించిన ఎస్ఎఫ్ఐ నాయకులు మైదుకూరు డిపో మేనేజర్ కు వినతిపత్రం
మండలం లోని బాలల బాలికల హైస్కూల్ తో పాటు మరికొన్ని స్కూల్లో సమీపంలో విద్యార్థులు ఆపిన ఆగకుండా వెళ్లడంతో . విద్యార్థిని విద్యార్థుల కోసం బస్సులు ఆపడం లేదని అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు స్కూల్ నుంచి కాజీపేట సెంటర్ వరకు నడుచుకొని వెళ్ళుటకు చాలా ఇబ్బంది పడుతున్నారని వారు తెలిపారు . మైదుకూరు నుంచి కడప , కడప నుంచి కాజిపేట వెళ్ళు బస్సులు అక్కడ ఉన్న విద్యార్థులు ఆపిన ఆపడం లేదని అక్కడే ఉన్నా బస్టాప్ దగ్గర కూడా ఆపకుండా వెళ్తున్నారని
విద్యార్థులు కాకుండా ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు, స్థానిక ప్రజానీకం డిపోకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చిన అధికారులు పట్టించుకోవడంలేదని , కావున ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అక్కడున్న విద్యార్థిని విద్యార్థులకు బస్సులు ఆపే విధంగా సమయానికి గమ్యానికి చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కైనా సిద్ధం అని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు దుగ్గి రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎస్ఎఫ్ఐ నాయకులు అభి ,పవన్ లు పాల్గొన్నారు...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి