గస్తీమే సవాల్...
ఖాజీపేట గత ఆరు నెలల నుంచి అటు ప్రజలకు ఇటు అధికారులకు నిద్ర లేకుండా చేస్తున్న దొంగలు.
ఎవరిని నిర్లక్ష్యము గానీ ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి పోలీసులు రాతిని గస్తీలు నిర్వహించకపోవడం ప్రధాన కారణమని కొందరు ప్రజలు నోరు నెత్తి కొట్టుకుంటున్నారు.
సంవత్సరంలో భూమయ్యపల్లె భీమలింగేశ్వర ఆలయంలో ఎనిమిది సార్లు దొంగతనం జరిగింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది గతంలో సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఈ సంఘటనలు జరిగాయని అధికారులు చెబుతున్న ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్న కూడా జరిగాయి అంటే రాత్రి సమయాల్లో నిఘ ఎలా ఉందో తెలుస్తుంది.
ఇంకా వ్యవసాయదారుల విషయాన్నికొస్తే రోజుఎక్కడ ఒకచోట మోటార్ల కేబుల్స్ పోలేదని రైతులు చెప్పిన పాపన పోలేదు. గతంలో వరస దొంగతనాలతో రైతులు నిద్ర లేకుండా అవస్థలు పడిన విషయం అందరికీ తెలిసిందే అయితే దొంగలను కాపాడడానికి కొందరు పార్టీ నాయకులు దొంగలకు వత్తాసు పలికి వారి పైన కేసులు నమోదు కాకుండా విడిపించారంటే రైతులంటే అందరికీ చులకనగా తయారైంది. రైతులు లేని సమయంలో కేబుల్స్ దొంగిలించడంతో ఒక రైతుకు సుమారు 2000 నుంచి 3000 ఖర్చు వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్లుగా దేవాలయాలు ఇల్లు వ్యవసాయ మోటర్లు బైకులు కళ్ళు మూసి తెరిచే లోపల బైకులు మాయమవుతున్నాయి.
ఇండ్లలో దొంగతనాలు చెప్పాల్సిన పనిలేదు రోజుకో ఊరిలో దొంగతనాలు జరుగుతున్నాయి. ఏం పోతాయని ఆందోళనలో నిద్ర పట్టని ప్రజలకు ఎలాంటి భరోసా లేకపోవడంతో వారికి వారే కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
అధికారులు అయితే సిసి కెమెరాలు పెట్టుకోండి అని ఉచిత సలహా ఇచ్చి వెళ్ళిపోతున్నారు సిసి కెమెరాలు లో రికార్డ్ అయిన దొంగల్ని ఇప్పటికి కూడా పట్టుకోలేకున్నారంటే అధికారుల నిర్వహణ లోపం స్పష్టంగా కనబడుతుంది.
గత రాత్రి కొన్ని గ్రామాలలో మోటర్ కేబుల్ పోయిన ఎవరు ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు కథ నెల రోజుల నుంచి కాజీపేటలో సుమారు పది బైకులు కంటే ఎక్కువే తొంగించబడ్డ అది ఎక్కడ దొరుకుతాయి లేని కొందరు వాహనదారులు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడడం లేదు .
ఈ దొంగలకు ఎప్పుడు చరమగీతం పాడుతారని వేయికళ్లతో ఎదురు చూస్తున్న రైతులు ప్రజలు...
తాజాగా కాజీపేట వి ఎస్ జువెలరీలో సీసీ కెమెరాలు పగలగొట్టి మరీ దొంగతనం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది అందరూ తిరుగుతున్న ప్రధాన దారిలో ఇలాంటి దొంగతనం జరగడం కాజీపేట ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి