ఖాజీపేట పత్తి రామచంద్రారెడ్డి న్యాయం చేయండి రైతు సంఘం నాయకులు
ఖాజీపేట మండలం బకాయి పల్లి లో గత 19వ తేదీ యువ రైతు రామచంద్ర రెడ్డి మృతి పై వెంటనే నష్టపరిహారం చెల్లించాలి రైతు సంఘం నాయకులు ఏ వి రమణ.
మూడు సంవత్సరాల కాలంలో పకృతి వైపరీత్యాల వల్ల పకృతిలో వచ్చే అకాల వర్షం, అధిక వర్ష ప్రభావంతో రైతు పెట్టిన పంట పండక పోగా , పంట వచ్చిన గిట్టుబాటుమద్దతు ధర లేకపోవడంతో రైతు పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టపోతుండడం జరిగింది.
అలాంటి స్థితిలోనే కాజీపేట మండలం బక్కాయపల్లి గ్రామానికి చెందిన యువరైతు పత్తి రామచంద్రారెడ్డి ఈనెల 19వ తేదీ తన పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నందున భార్య ముగ్గురు పిల్లలు ఉన్న రైతు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణగారు ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో రైతులు ,సమితి సభ్యులతో కలిసి కాజీపేట మండలతాసిల్దార్ గారి ద్వారా రైతు సేవా సమితి వినతిని వినతి పత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి జిల్లా సభ్యుడు మూలే. రామాంజనేయ రెడ్డి, రైతులు ములపాకు బాల గంగిరెడ్డి, నానబాల నరసింహ, ములపాకు గంగిరెడ్డి, ఓబులేసు, శ్రీకాంత్ రెడ్డి,మురళి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి