వ్యక్తి ఆత్మహత్య..
కాజీపేట మండలం దుంపలగట్టులో గత రాత్రి నారాయణరెడ్డి అనే వ్యక్తి విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
నారాయణరెడ్డి గత నెల రోజుల కిందట పేకాటలో కాజీపేట పోలీసులు అరెస్టు చేసి అతనిపైన గాంజా కేసు నమోదు చేసి ఇష్టానుసారంగా కొట్టడం వల్ల బెయిల్ మీద ఇంటికి వచ్చిన నారాయణరెడ్డి గత రాత్రి దుంపలగట్టు పంట పొలాలలో ఒక ట్రాన్స్ఫార్ అని పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు
బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఇష్టానుసారుగా కొట్టడం వల్ల బెయిల్ మీద నుంచి ఇంటికి వచ్చినప్పటి చిన్న వస్తువు కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారని బాడీ పైన ఇష్టానుసారంగా కొట్టినట్లు గాయాలు ఉన్నాయని ఆయన భార్య తెలియజేసింది.
మేము గంజాయి అమ్మడమేమిటి పూల అమ్ముకొని బతికే వాళ్ళమని పోలీసులు ఉద్దేశపూర్వక మా భర్త పైన కేసు నమోదు చేయడంతో పాటు ఇష్టానుసారంగా కొట్టడంతో అవమానంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని భార్య తెలియజేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి